మరణించినవారి పేర్లపై జీతాలు

వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో కోట్ల రూపాయల కుంభకోణం

మరణించినవారి పేర్లపై జీతాలు

కలెక్టర్ ముందు సాక్ష్యాలతో బట్టబయలు చేసిన అఖిలపక్ష ఐక్యవేదిక

వనపర్తి,సెప్టెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్‌సోర్సింగ్ కార్మికుల జీతాలను కాంట్రాక్టర్ కాజేస్తున్నాడని, అతనికి తోడుగా ఒక ప్రముఖ ప్రజాప్రతినిధి అల్లుడు, మాజీ కౌన్సిలర్ ఉన్నారని అఖిలపక్ష ఐక్యవేదిక ఆరోపించింది. ఈ వ్యవహారంపై పలు ఆధారాలతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది.
మెడికల్ కాలేజీ ఏర్పాటుతో జిల్లా ఆసుపత్రుల్లో 148 మంది సిబ్బందిని నియమించాల్సి ఉండగా, వాస్తవానికి తక్కువ మందిని మాత్రమే పని చేయించి, మిగిలిన ఖాళీల పేర్లపైనా జీతాలు డ్రా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, మరణించిన వారి పేర్లపైనా జీతాలు తీసుకోవడం జరుగుతోందని ఐక్యవేదిక బట్టబయలు చేసింది.
నెలకు 10 నుంచి 20 లక్షల వరకు, గత మూడు సంవత్సరాలుగా కోట్లలో కుంభకోణం కొనసాగుతోందని ఆరోపించారు. కార్మికుల నుండి కమిషన్లు వసూలు చేయడం, భవిష్య నిధి (పీఎఫ్) మొత్తాలు ఇవ్వకపోవడం, అధికారుల కుమ్మక్కుతో ఈ దోపిడీ జరుగుతోందని పేర్కొన్నారు.

WhatsApp Image 2025-09-15 at 8.34.16 PM

ఐక్యవేదిక డిమాండ్: కాంట్రాక్టర్‌తో పాటు సంబంధిత సూపరింటెండెంట్, ఇతర అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి.
అక్రమంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి కార్మికులకు చెల్లించాలి.ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్, గంధం నాగరాజు, నక్క కృష్ణ యాదవ్, వెంకటేశ్వర్లు, కొత్తగొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, నక్క సురేష్ యాదవ్, గంధం భరత్ కుమార్, నాగరాజు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .