తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
ధర్మసాగర్,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు):
ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో బిజెపి గ్రామ శాఖా అధ్యక్షులు పెసరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేకు కోసి,పండ్లు పంపిణీ చేశారు.అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ....దేశ ప్రగతి కోసం మోడీ చేస్తున్న కృషి విశేషమని, ఆయన జన్మదినాన్ని ప్రజా సేవా దినోత్సవంగా గుర్తించుకోవాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో కోట్లాది ప్రజలు లబ్ధి పొందుతున్నారని, గ్రామాల అభివృద్ధి కోసం బీజేపీ కృషి చేస్తోందని ఆయన తెలిపారు. యువతలో దేశభక్తి, సేవాభావం పెంపొందించేందుకు ఇలాంటి వేడుకలు ప్రేరణగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.నాయకులు, కార్యకర్తలు ప్రధాని దీర్ఘాయుష్షు కోసం ఆకాంక్షిస్తూ, అభివృద్ధి మార్గంలో దేశం ముందుకు నడిపించాలని సంకల్పం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ననుబాల కుమార్ స్వామి, యూత్ అధ్యక్షులు దువ్వల అఖిల్, బూత్ అధ్యక్షులు కొండబోయిన మహేష్, పిట్టల హరీష్, చింతగింది వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు బొల్లెపాక వెంకటస్వామి, సల్ల శివకృష్ణ, వల్లాల అనిల్, ననుబాల సర్వేశ్వర్, దువ్వల బిక్షపతి, చొక్కం రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments