ఘనంగా 76వ తెలంగాణ విమోచన దినోత్సవం
కుషాయిగూడ, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కుషాయిగూడ బస్ స్టాప్ సమీపంలో 76వ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఎగురవేసి, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నిజాం నిరంకుశ పాలనకు తెరదించుతూ, హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన పటేల్ త్యాగస్ఫూర్తిని ఆయన స్మరించారు.మోడీ జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు:ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని, చర్లపల్లి డివిజన్ బిజెపి అధ్యక్షులు చల్లా ప్రభాకర్ ఆధ్వర్యంలో, సేవాపక్షం 2025 కన్వీనర్ నాలాచెర్ల జనార్ధన్, కో కన్వీనర్లు నాగమణి, సంపత్ పర్యవేక్షణలో రక్తదాన శిబిరం నిర్వహించారు.మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా, అనంతరం జిహెచ్ఎంసి సఫాయి కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో 75 మంది మోడీ అభిమానులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాల్లోబిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, కార్పొరేటర్ అభ్యర్థులు కాసుల సురేందర్ గౌడ్, గణేష్ ముదిరాజ్, ఆర్. వెంకటేశ్వర్లు (వెంకులు), అలాగే ఆనంద్ గౌడ్, నాదం, హరినాయక్, లక్ష్మీనారాయణ, రమేష్ చౌదరి, బ్రహ్మచారి, దయానంద్, పిట్టల రాజు, గణేష్ గౌడ్, సహదేవ్ గౌడ్, రాంబాబు, అప్పి, బండారి అనిల్, వివేక్, శ్రీకాంత్, కళావతి, శంకర్ వంశరాజ్, రాజేష్ వంశరాజ్, రామకృష్ణ, ఆర్కే, యాదయ్య, సిహెచ్. లక్ష్మణ్, శ్రీశైలం, గొల్ల శ్రీను ముదిరాజ్, పిట్టల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments