ఇండియాన్ రిపోర్టర్స్ అసోసియేషన్ తెలంగాణ జాయింట్ సెక్రటరీగా బైరపాక మహేష్
రాష్ట్ర అధ్యక్షులు శరత్ చంద్ర ఉత్తర్వులు జారీ
Views: 26
On
•నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన మహేష్
•సంఘ బలోపేతానికి కృషి చేస్తానని మహేష్ హామీ
•జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న మహేష్
జనగాం,సెప్టెంబర్14(తెలంగాణ ముచ్చట్లు):
ఇండియాన్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఐఆర్ఏ) తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా జనగాం జిల్లా హిమ్మత్ నగర్ కు చెందిన బైరపాక మహేష్ నియమితులయ్యారు.ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు శరత్ చంద్ర ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
తన నియామకంపై స్పందించిన మహేష్, “నాపై నమ్మకం ఉంచి ఈ పదవీ బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు శరత్ చంద్ర, జాతీయ కమిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జర్నలిస్టుల సంక్షేమమే నాకు ప్రథమ కర్తవ్యం. సంఘం బలోపేతం, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అన్ని సమస్యలను తీసుకెళ్లి తగిన పరిష్కారం కోసం పోరాడతాను” అని స్పష్టం చేశారు.
మహేష్ తన నియామకాన్ని జర్నలిస్టు సమాజానికి అంకితం చేస్తూ, “ఈ పదవి నాకు గౌరవం మాత్రమే కాదు బాధ్యత కూడా. సహచర జర్నలిస్టుల అండతో ముందుకు సాగుతూ ఐఆర్ఏ ప్రతిష్ఠను పెంచుతాను” అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments