వెల్టూర్ చెరువు సుందరీకరణ వృథా
మందుబాబులకు అడ్డాగా మారిన వెల్టూర్ చెరువు కట్ట
చెరువు కట్టపై 62 సోలార్ లైట్లు ధ్వంసం, గ్రామస్తులు ఆగ్రహం
పెద్దమందడి,సెప్టెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలోని గోపాల సముద్రం చెరువు ఇటీవల పునర్నిర్మాణం చేసి, చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్ తరహాలో తీర్చిదిద్దారు. చెరువు సుందరీకరణలో భాగంగా కట్టకు ఇరువైపులా సోలార్ లైట్లు అమర్చి ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన చెరువు కట్ట గ్రామానికి ఆహ్లాదకర వాతావరణాన్ని తీసుకువచ్చింది.
అయితే, ఈ అందాలను కాపాడుకోవాల్సిన బదులు చెరువు కట్ట మందుబాబులకు అడ్డాగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు చెరువు కట్టకు ఇరువైపులా అమర్చిన 62 సోలార్ లైట్లను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"చెరువు కట్ట దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఇలాంటి సంఘటనలుజరగవు," అని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి గ్రామస్తుడి బాధ్యత అని, సుందరీకరణ కోసం ఖర్చు చేసిన నిధులు వృథా కావడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
"మన ఊరు – మన ప్రదేశం – మన ప్రకృతి"ని సంరక్షించుకోవాలని, ఇటువంటి ధ్వంసకర చర్యలను అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments