ఘనంగా ప్రధాని మోడీ 75వ జన్మదిన వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీలో 

ఘనంగా ప్రధాని మోడీ 75వ జన్మదిన వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీలో 

తార్నాక , సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల ముందు విద్యార్థి నాయకులు జాడీ రమేష్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్ హాజరై విద్యార్థులతో కలిసి జన్మదిన కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. విద్యార్థులు "లాంగ్ లివ్ నరేంద్ర మోడీ జీ" అంటూ నినాదాలతో కార్యక్రమాన్ని సందడిగా మార్చారు.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు జాడీ రమేష్ మాట్లాడుతూ :వికసిత్ భారత్ లక్ష్యంతో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రాత్రింబగళ్లు కృషి చేస్తున్నారని.జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపుతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన మేలు జరుగుతోందని. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి కొనసాగిస్తున్నారని తెలిపారు.అలాగే దేశ ప్రధానిగా రికార్డు సృష్టించడమే కాకుండా అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను పెంపొందించడంలో నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన గ్లోబల్ లీడర్‌గా పేరు సంపాదించడం భారతీయులందరికీ గర్వకారణమని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు వినోద్ నునావత్, చరణ్, సుధాకర్, ఇక్షిత్, అనిత ముదిరాజ్, డా. కతరసాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
  ధర్మసాగర్,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో బిజెపి గ్రామ శాఖా అధ్యక్షులు పెసరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా
అంబేద్కర్ కళాభవనానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం
పెద్దమందడిలో బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం 
హెచ్‌.యం.టి. నగర్‌లో ప్రతిరోజూ జాతీయ గీతాలాపన
అక్రమసంబంధం కోసమే సుఫారీ పేరుతో జైలుకు...?