మల్కాజ్గిరి రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌లు నిలిపివేత

స్థానిక ప్రయాణికులకు ఉపశమనం

మల్కాజ్గిరి రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌లు నిలిపివేత

 మల్కాజ్గిరి, సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజ్గిరి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపేలా చేపట్టిన చర్యలు స్థానికుల్లో హర్షాన్ని కలిగించాయి. ముఖ్యంగా దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులు, హైదరాబాద్‌ నగరానికి మధ్య ప్రయాణించే వారికి ఇది గొప్ప అవకాశం. ఇప్పటివరకు ప్రధాన స్టేషన్లకే పరిమితమైన ఎక్స్‌ప్రెస్ సేవలు ఇప్పుడు మల్కాజ్గిరిని కూడా కలుపు కోవడం వల్ల సమయం, ప్రయాణ ఖర్చు రెండూ ఆదా అవుతాయని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.
జెడ్ ఆర్ యు సి సి సభ్యుడు నూర్ ఇటీవల రైల్వే సమావేశంలో, “దూర ప్రాంతాల నుండి వచ్చే రైళ్లను మల్కాజ్గిరి స్టేషన్‌లో కొన్ని నిమిషాలు నిలిపితే, ప్రయాణికులు ఇక్కడ దిగి తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు సౌలభ్యం కలుగుతుంది” అని వినతి చేశారు. దీనికి స్పందించిన రైల్వే అధికారులు, ఇప్పటికే ప్రయోగాత్మకంగా 8 ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపేలా చర్యలు చేపట్టారు.శనివారం నాడు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి మొదటగా హైదరాబాద్ – హిసార్ ఎక్స్‌ప్రెస్ నిలిపి, స్థానిక ప్రజలు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతించారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, పి సి ఓ యం కే పద్మజ, డి ఆర్ యం సంతోష్ కుమార్ వర్మ, హైదరాబాద్, డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్, సికింద్రాబాద్ డి ఆర్ యం లకు ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.స్టేషన్ మేనేజర్ శ్రీనివాస రావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రయాణికుల సంఘ ప్రతినిధులు ఏ వి స్వామి, పి భరద్వాజ్, హసీనా, వై శంకర్ రావు, వెంకటేష్ ఆచారి, ఎన్ సత్యమూర్తి, రోషన్ తదితరులు పాల్గొని, ప్రయాణికుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ నిర్ణయాన్ని అభినందించారు.ఈ సందర్భంగా వారు దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ముందస్తుగా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మల్కాజ్గిరి ప్రాంతంలో ప్రయాణ సౌకర్యాలు మరింత మెరుగుపడటంతో, స్థానిక ప్రజల నుండి మంచి స్పందన లభించింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .