శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి
చిల్కానగర్, సెప్టెంబర్ 17(తెలంగాణ ముచ్చట్లు) :
ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ గుట్టపై ఉన్న బ్రహ్మంగారి గుడిలో మంగళవారం శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పూజా కార్యక్రమం, హోమం నిర్వహించగా అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.ఈ సందర్భంగా చిల్కానగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొంపెల్లి రవీందర్ ముదిరాజ్, జల్లి మోహన్, విశ్వకర్మ సంఘం కార్యవర్గ సభ్యులు, విశ్వకర్మ కుల పెద్దలు భారీగా పాల్గొన్నారు.నాయకులు మాట్లాడుతూ.విశ్వకర్మ మహర్షి మన సమాజానికి శిల్పకళ, వృత్తిపరమైన నైపుణ్యాలు అందించి దేశ అభివృద్ధికి మార్గదర్శకుడని పేర్కొన్నారు. ఆయన జయంతిని ప్రతి సంవత్సరం ఘనంగా జరపడం విశ్వకర్మ వంశస్థుల ఐక్యతకు, ఆధ్యాత్మికతకు ప్రతీక అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక యువత, మహిళలు కూడా పాల్గొని పూజల్లో భాగమయ్యారు. అన్నదానంలో వందలాది మంది భక్తులు పాల్గొని ఆశీర్వాదం పొందారు.
Comments