ఖమ్మంలో 17న మెగా రక్తదాన శిబిరం
మోడీ జన్మదినం , విమోచన దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమం
సేవాభావంతో ప్రజలు ముందుకు రావాలి.
బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 15, తెలంగాణ ముచ్చట్లు;
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలో ఈనెల 17వ తేదీన మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు సోమవారం ప్రకటించారు.
ఖమ్మం నగరంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్‌లో ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు. సేవా భావంతో రక్తదానం చేయడం వల్ల అనేక మంది ప్రాణాలు కాపాడబడతాయని, ప్రతి పౌరుడు ఒక ప్రాణరక్షకుడిగా నిలుస్తారని అన్నారు. మోడీ జన్మదినాన్ని గుర్తించేందుకు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఖమ్మంలో రక్తదాన శిబిరం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆయన వివరించారు. అదేవిధంగా తెలంగాణ విమోచన దినోత్సవం, మోడీ జన్మదినం ఒకే రోజు రావడం చారిత్రక ప్రత్యేకత. ఈ సందర్భాన్ని గుర్తించేందుకు పార్టీ తరఫున శ్రేయోభిలాషులు, యువత, కార్యకర్తలతో కలిసి రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ మెగా రక్తదాన శిబిరానికి ప్రజలందరూ ముందుకు వచ్చి సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు.
Comments