వికలాంగుల పెన్షన్ల హామీ అమలు చేయాలని డిమాండ్

కాప్రారెవెన్యూకార్యాలయ ముట్టడి చేసిన వికలాంగులు, సంఘ నాయకులు

వికలాంగుల పెన్షన్ల హామీ అమలు చేయాలని డిమాండ్

కాప్రా, సెప్టెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం కాప్రా మండలరెవెన్యూ  కార్యాలయం వద్ద భారీగా ధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులుసత్యనారాయణ నాయత్వం వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వికలాంగుల పెన్షన్‌ను రూ. 4000 నుంచి రూ. 6900కి పెంచుతామని, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికుల పెన్షన్‌ను రూ. 2000 నుంచి రూ. 4000కి పెంచుతామని హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ఈ హామీ అమలు చేయకపోవడం దారుణమని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాగే వికలాంగులకు 5 శాతం కోటా ప్రకారం గృహాలను కట్టివ్వాలని జి.ఓ ఉన్నప్పటికీ,ఇప్పటివరకు ప్రభుత్వం ఈవిషయాన్ని పట్టించు కోలేదని వారు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న పెన్షన్లు తక్షణమే మంజూరు చేయాలని, ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు గత మూడు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా, ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని నాయకులు వ్యాఖ్యానించారు.WhatsApp Image 2025-09-15 at 6.16.48 PMఈ నేపథ్యంలో సోమవారం అన్ని మండల కార్యాలయాల వద్ద ఒకేసారి ధర్నా నిర్వహించారు.కాప్రా మండలరెవెన్యూ  కార్యాలయం వద్ద జరిగిన ఈ నిరసనలో పాల్గొన్న వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలురెవెన్యూ  సత్యనారాయణకు వినతి పత్రం సమర్పించారు. ధర్నా ప్రారంభానికి ముందు ఎం.ఏ.పి.ఎస్ కళామండలి పాటలతో ప్రజల్లో ఉత్సాహం నింపారు.ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.పి.ఎస్ జాతీయ నాయకులు,మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్‌చార్జ్ తిప్పరపు లక్ష్మణ్ మాదిగ, ఎం.ఎస్.పి జిల్లా అధ్యక్షులు కేశపాగ రాంచందర్ మాదిగ, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ఇన్‌చార్జి నర్సింహా, గంగపుత్ర శ్రీనివాస్, ధనరాజ్, రాంచందర్ మాదిగ, శోభ, రజిత తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
  ధర్మసాగర్,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో బిజెపి గ్రామ శాఖా అధ్యక్షులు పెసరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా
అంబేద్కర్ కళాభవనానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం
పెద్దమందడిలో బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం 
హెచ్‌.యం.టి. నగర్‌లో ప్రతిరోజూ జాతీయ గీతాలాపన
అక్రమసంబంధం కోసమే సుఫారీ పేరుతో జైలుకు...?