అక్రమసంబంధం కోసమే సుఫారీ పేరుతో జైలుకు...?

విలేకరుల సమావేశంలో న్యాయం చేయాలని వేడుకున్న మాజీ సర్పంచ్

అక్రమసంబంధం కోసమే సుఫారీ పేరుతో జైలుకు...?

ఖమ్మం బ్యూరో చీఫ్, సెప్టెంబర్ 17, తెలంగాణ ముచ్చట్లు;

 వివాహేతర సంబంధం కోసమే అడ్డు తొలగించుకునేందుకు సుఫారీ సృష్టించి అక్రమ కేసు పెట్టించి జైలుకు పంపారని ముదిగొండ మండలం సువర్ణపురానికి చెందిన తోట మౌనిక ఆరోపించింది. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తోట మౌనిక తన తండ్రితో కలిసి మాట్లాడుతూ.. ముదిగొండ మండలం సువర్ణ పురం గ్రామానికి చెందిన తోట ధర్మారావుతో 15 సంవత్సరముల క్రితం వివాహం జరిగి ఇద్దరు కుమారులని తెలిపింది. మొదటి నుండి తన భర్త అనుమానం వ్యక్తం చేసేవాడని ఎవరితో మాట్లాడిన అక్రమ సంబంధం అంతకట్టేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటి చుట్టూ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటుచేశాడని పేర్కొంది. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని తెలిపింది. తనను అడ్డు తొలగించుకునేందుకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం సృష్టించి సుపారి మర్డర్ ప్లాన్ చేసుకొని, ఇటు మా తల్లిగారి ఊరు, అటు అత్తగారు ఊరు కాకుండా ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ పేరుతో పిలిపించి తనకు తెలియకుండానే జైలుకు పంపారని ఆరోపించింది. జైలు నుండి వచ్చిన తర్వాత ఇంటికి, తన ఫోనుకు ఉన్న సీసీటీవీ అనుసంధానం వలన వారి అక్రమ సంబంధం బయటపడిందని తెలిపింది. ఇట్టి విషయమై ముదిగొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని తెలిపింది తనతో వివాహం జరిగి వేరే మహిళలతో అక్రమ సంబంధం, తన పెద్ద కుమారుడిని చూడనీయకుండా వేదనకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసు అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని వేడుకుంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
  ధర్మసాగర్,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో బిజెపి గ్రామ శాఖా అధ్యక్షులు పెసరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా
అంబేద్కర్ కళాభవనానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం
పెద్దమందడిలో బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం 
హెచ్‌.యం.టి. నగర్‌లో ప్రతిరోజూ జాతీయ గీతాలాపన
అక్రమసంబంధం కోసమే సుఫారీ పేరుతో జైలుకు...?