న్యాయం కోసం పోరాటాలను తీవ్రతరం చేయాలి.

 సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి.

న్యాయం కోసం పోరాటాలను తీవ్రతరం చేయాలి.

 సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి.

 హసన్ పర్తి, సెప్టెంబర్ 13( తెలంగాణ ముచ్చట్లు):

 4వేల గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూమిని పంచి తెలంగాణలో హైదరాబాద్ నిజాం అమానుషమైన నియంతృత్వ ఫ్యూడల్ విధానాలను,ప్రజలను తీవ్రంగా నిర్బంధిస్తూ స్త్రీలకు రక్షణ లేకుండా నిరంతరం భయభ్రాంతులకు గురి చేస్తున్న నిజాం తాబేదారులను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మట్టి కరిపించిందని సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి,కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి తెలియజేశారు.
హసన్ పర్తి మండల కేంద్రంలో శనివారం రోజున మెట్టు శ్యాంసుందర్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్ర బిక్షపతి,నేదునూరి జ్యోతి హాజరై మాట్లాడుతూ రజాకార్ గుండాలను,నిజాం సాయుధ దళాలను భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర మహాసభ పిలుపుతో రావి నారాయణరెడ్డి,బద్దం ఎల్లారెడ్డి,మగ్దుమ్ మైనోద్దీన్ సాయుధ ప్రతిఘటనకు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. జాగిరిదారులు,భూస్వాములు,వ్యవసాయ కార్మికులపై,స్త్రీలపై,తిరగబడ్డ ప్రజలపై లాఠీ తూటాలు కురిపిస్తుంటే మట్టి మనుషులకు చైతన్యం అందించి బందూకులు పట్టించి దొరల పెత్తనాన్ని,నైజాం సైన్యాన్ని,భారత సైన్యాలను మట్టి కరిపించిన చరిత్ర తెలంగాణ సాయుధ పోరాట విప్లవ వీరులు అందించిన రక్త చరిత్ర తెలంగాణ విముక్తికి కారణమన్నారు.ఈ ప్రాంతంలో తోకల కొమరారెడ్డి,పాడి చంద్రారెడ్డి,గంగిళ్ళ లింగారెడ్డి,రేణిగుంట్ల ఐలయ్య,పురేడి మల్లయ్య పేద ప్రజల విముక్తి కోసం కుటుంబాలను త్యాగం చేసి అమరత్వం పొందిన వీరులని కొనియాడారు. వీరి స్ఫూర్తితో ప్రజాస్వామ్య రక్షణ, రాజ్యాంగ రక్షణ,లౌకిక వ్యవస్థ,సామాజిక న్యాయం కోసం పోరాటాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆదిరి శ్రీనివాస్ మాట్లాడుతూ సాయిధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ హిందూ ముస్లింల పోరాటంగా చిత్రీకరించడాన్ని తిప్పి కొట్టి సాయుధ పోరాట చరిత్రను ప్రజల్లోకి తీసుకుపోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్,భారత్ బచావో నాయకులు దోమ్మటి ప్రవీణ్ కుమార్,షేక్ బాబు, రేణిగుంట్ల రాజయ్య, నేదునూరి సాంబయ్య, గోపరాజు భద్రయ్య, బందెల తిరుపతి,వడ్లూరి సుధాకర్,అజయ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
  ధర్మసాగర్,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో బిజెపి గ్రామ శాఖా అధ్యక్షులు పెసరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా
అంబేద్కర్ కళాభవనానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం
పెద్దమందడిలో బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం 
హెచ్‌.యం.టి. నగర్‌లో ప్రతిరోజూ జాతీయ గీతాలాపన
అక్రమసంబంధం కోసమే సుఫారీ పేరుతో జైలుకు...?