వాసవి క్లబ్100 రోజుల్లో 100 మొక్కలు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినారు

పర్యావరణ పరిరక్షణకు ముందడుగు

వాసవి క్లబ్100 రోజుల్లో 100 మొక్కలు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినారు

కాప్రా, సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రకృతి రక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాలనే లక్ష్యంతో, వాసవి క్లబ్స్ కాప్రా సర్కిల్ చేపట్టిన “100 రోజుల్లో 100 మొక్కలు” వృక్షార్చన కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్‌ బీ డివిజన్‌లోని హెచ్‌ బీ కాలనీ ఫేజ్-1 గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమానికి కార్పొరేటర్ జరిపోతుల ప్రభుదాస్ ముఖ్య అతిథిగా హాజరై వాసవి క్లబ్ ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు.ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వాసవి క్లబ్ ప్రతినిధులు, కాప్రా సర్కిల్ అంతర్జాతీయ అధ్యక్షుడు విఎన్ డైమండ్ కేజీ సిఎఫ్ ఎరుకుల్లా రామకృష్ణ ఇచ్చిన దిశానిర్దేశంతో ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. “ఈ కార్యక్రమం కేవలం మొక్కలు నాటడమే కాదు, మన పిల్లల భవిష్యత్తును కాపాడటానికి వేసే అడుగు” అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ ప్రభుదాస్ విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేసి, వాటిని సంరక్షించి పెంచాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. ఈ సందర్భంగా సెయింట్ పాల్స్ పాఠశాల విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని పర్యావరణంపై అవగాహన కార్యక్రమాల్లో భాగమయ్యారు. చిన్న వయస్సులోనే ప్రకృతి విలువలు అర్థం చేసుకునేలా చేయడం ఈ కార్యక్రమానికి ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు వివరించారు.
అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ వి ఎన్ గోల్డెన్ కేజీ సిఎఫ్ మశెట్టి ఉపేందర్, డిస్టిక్ గవర్నర్ విఎన్ ఎరుకుల్ల ప్రదీప్ కుమార్, దిష్టికి ఇంచార్జ్‌లు ఖడ్గం వెంకటేష్, చమర్తి శ్రీనివాస్, రీజన్ చైర్పర్సన్ గాదె రాజేష్, జోన్ చైర్పర్సన్ గౌరీశెట్టి రామచంద్రం, క్లబ్ కార్యదర్శులు, ఖజాంచీలు, పూర్వాధ్యక్షులు, ఈసీ సభ్యులు, సెయింట్ పాల్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్తిరెడ్డి, సంక్షేమ సంఘ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.వాసవి క్లబ్ ప్రతినిధులు, “ప్రతి మొక్క ఒక జీవానికి మూలం, ప్రతి అడుగు పచ్చదనానికి అడుగు” అని పేర్కొంటూ, ప్రజలు ముందుకు వచ్చి ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో పర్యావరణంపై చైతన్యం పెంచడమే కాకుండా, అందరూ కలిసి చర్యలు తీసుకుంటే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమని చెప్పారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
  ధర్మసాగర్,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో బిజెపి గ్రామ శాఖా అధ్యక్షులు పెసరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా
అంబేద్కర్ కళాభవనానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం
పెద్దమందడిలో బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం 
హెచ్‌.యం.టి. నగర్‌లో ప్రతిరోజూ జాతీయ గీతాలాపన
అక్రమసంబంధం కోసమే సుఫారీ పేరుతో జైలుకు...?