కాలనీ సమస్యల పరిష్కారం కోరుతూ నివాసితుల నిరసన

కాలనీ సమస్యల పరిష్కారం కోరుతూ నివాసితుల నిరసన

మల్కాజిగిరి, సెప్టెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్‌నగర్ డివిజన్ పరిధిలోని మీర్జాలగూడ చిన్మయ మార్గ్ కాలనీ వాసులు ఆదివారం రోడ్డుపైకి వచ్చి తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు.నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం, హుడా మాస్టర్ ప్లాన్ ప్రకారం 66 అడుగులు ఉండాల్సిన రహదారి కేవలం 15 అడుగులకే పరిమితమైందని, దీంతో కాలనీలోకి అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ వంటి అత్యవసర వాహనాలు ప్రవేశించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల నుండి వచ్చే మురుగునీరు ఇళ్లలోకి చేరి జీవనాన్ని దయనీయ స్థితికి నెడుతోందని, పలువురు ప్రమాదాలకు గురైన ఘటనలు చోటుచేసుకున్నాయని నివాసితులు తెలిపారు.వారికి అనుగుణంగా రెండు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బాక్స్ డ్రైనేజ్ పనులు నాణ్యత లోపించి సక్రమంగా పనిచేయడం లేదని, ఫలితంగా సమస్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

సమస్యల పరిష్కారం కోసం కాలనీ వాసులు వెంకటేశ్వర స్వామి గుడి నుండి రాజీవ్ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంధ్య, ఉమామహేశ్వరి, శోభ, కొమరమ్మ, మధు నాయుడు, కరుణాకర్, బాలుజీ నాయక్, వెంకటేష్, అవినాష్ పుడి, విద్య, మహాలక్ష్మి, జంగాల శ్రీరామ్ యాదవ్ తదితరులు మాట్లాడుతూ రహదారి విస్తరణ, మురుగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని కోరారు.కాలనీ వ్యవస్థాపకుడు జంగాల శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ – “ప్రభుత్వ ప్రతినిధులు కాలనీ సమస్యలపై చర్యలు తీసుకోకపోతే నిరవధిక దీక్షలు చేపట్టడం తప్పదని” తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
  ధర్మసాగర్,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో బిజెపి గ్రామ శాఖా అధ్యక్షులు పెసరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా
అంబేద్కర్ కళాభవనానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం
పెద్దమందడిలో బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం 
హెచ్‌.యం.టి. నగర్‌లో ప్రతిరోజూ జాతీయ గీతాలాపన
అక్రమసంబంధం కోసమే సుఫారీ పేరుతో జైలుకు...?