సిసి రోడ్డు పనులు పర్యవేక్షించిన కార్పొరేటర్ బన్నాల
చిలుకానగర్, నవంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం చిలుకానగర్ డివిజన్‌లో సుమారు 36 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ సిసి రోడ్ పనులను పర్యవేక్షించారు. జిహెచ్ఎంసి అధికారులు, రాఘవేంద్ర నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆమె పనుల పురోగతిని పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడిన కార్పొరేటర్ గీతా ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ“ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. సిసి రోడ్ నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యత అత్యవసరం. జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి. నిర్మాణ సమయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నాణ్యతలో ఏమైనా లోపాలు చోటు చేసుకున్నా కఠిన చర్యలు తప్పవు” అని తెలిపారు.కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ రాధిక, వర్క్ ఇన్స్పెక్టర్ కేదార్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఎద్దుల కొండల్ కోకొండ, కొందల జగన్, పల్లె వేణు గౌడ్, బాలకృష్ణ గౌడ్, శ్యామ్, బంటి గౌడ్, చిన్న,
రాఘవేంద్ర నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు ప్రొఫెసర్ రాములు, ముకుందరావు, అడ్వకేట్ శ్రీనివాస్ రావు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.



Comments