ఖమ్మం కమిషనరేట్లో పట్టుబడిన 624 కిలోల గంజాయి దహనం

IMG-20240930-WA0013

 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు 

వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నేతృత్వంలో సోమవారం శాస్త్రీయ పద్ధతిలో దహనం చేశారు. 

ఖమ్మం పోలీస్ కమిషనరేట్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన, సీజ్ చేసిన 624 కిలోల ఎండు గంజాయిని అడిషనల్ డీసీపీ నరేష్ కుమార్ పర్యవేక్షణలో పోలీస్ ఫైరింగ్ రెంజ్ మంచుకొండ అటవీ ప్రాంతంలో నిర్వీర్యం చేశారు. ఖమ్మం వన్ టౌన్ , ఖమ్మం టూ టౌన్ , ఖమ్మం త్రీ టౌన్ , నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, వేంసూరు, కల్లూరు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన 7 కేసుల్లో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు జరిపిన నేరస్థులను అరెస్టు చేసినట్లు అడిషనల్ డిసీపీ తెలిపారు. 

జిల్లాలో ఠాణాల్లో నిల్వ ఉన్న గంజాయి సరకును కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల గెజిట్ నోటిఫికేషన్ల ఆధారంగా పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు నిర్వీర్యం చేశామన్నారు. కార్యక్రమంలో సిఐలు ఉదయ్ కుమార్, రమేష్, జానర్ధన్, ఉస్మాన్ షారిఫ్ , కల్లూరు ఎస్సై ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .