99రూ.లు కొట్టు గొర్రె పొట్టేలు పట్టు
-ముప్పారం,నారాయణగిరి గ్రామ ప్రజలకు బంపర్ ఆఫర్
Views: 343
On
-కొత్తవాడ ఛాలెంజ్ యూత్ ఆధ్వర్యంలో క్రేజీ ఆఫర్
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
దసరా పండుగ సందర్బముగా మండలంలోని ముప్పారం-నారాయణ గిరి గ్రామాలకు చెందిన కొత్తవాడ ఛాలెంజ్ యూత్ క్రేజీ ఆఫర్ ప్రకటించింది.99రూ.లు కొట్టు గొర్రె పొట్టేలు పట్టు లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.ఈ సందర్బముగా గ్రామంలో బంపర్ ఆఫర్ పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది.నిర్వాహకులలో ఒకరైన అఖిల్ మాట్లాడుతూ ఆసక్తి కలవారు 99రూ.లు కట్టి కూపన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు.విజేతలను దసరా పండుగ రోజున అనగా ఈ నెల 11న డ్రా తీయనున్నట్లు ప్రకటించారు.మొదటి బహుమతిగా గొర్రెపొట్టేలు(10కేజీల), రెండవ బహుమతిగా 2 ఫుల్ బాటిల్స్(100 పేపర్),మూడవ బహుమతిగా కింగ్ ఫిషర్ బీర్ల పెట్టె(12బీర్లు) ఒక నాటుకోడి ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఆశావహులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments