ఖమ్మం లో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి.
--యస్ఆర్& బిజీ యన్ ఆర్ కళాశాల పూర్వ విద్యార్థి సంఘం డిమాండ్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు
కాంగ్రెస్పార్టీ తమ మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఖమ్మం ల ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు ఈ విద్యాసంవత్సరమే ప్రకటించాలని లేదా జిల్లా లోనిడిగ్రీ కళాశాల లను కలిపి క్లష్టర్ యూనివర్సిటీ గా వెంటనే ప్రకటించాలని ,యస్ఆర్ &బిజీయన్ఆర్ కళాశాల పూర్వ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది.అందుకోసం స్థానిక మంత్రులు కృషి చేయాలని కోరారు.ఆదివారం సంఘం అద్యక్షులు నల్లమోతు తిరుమల రావు అద్యక్షత నస్థానిక విడిఓ కాలనీలో జరిగిన కార్యవర్గ సమావేశం ఈమేరకు తీర్మానించింది.సమావేశ వివరాలు విలేకరుల సమావేశంలో యస్ఆర్ బిజీయన్ఆర్ కళాశాల పూర్వ విద్యార్థి సంఘం ప్రదానం కార్యదర్శి వీరెల్లి ఆనంద్ కుమార్ పత్రికలకు వెల్లడించారు.ఇటీవల జరిగిన యస్ఆర్ బిజీయన్ఆర్ కళాశాల పూర్వ విద్యార్థి సంఘం అపూర్వ సమ్మేళనం విజయవంతం చేసిన పూర్వ విద్యార్థుల కు కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా కళాశాల ఎదుర్కొంటున్న ప్రదానం సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నున్నట్లు వారు తెలిపారు.యస్ఆర్&బిజీయన్ఆర్ కళాశాల లో 13పిజీ కోర్సులు నిర్వహిస్తున్నప్పటికీ వసతులు తరగతులకు లేకపోవడం శోచనీయమన్నారు.ఖాళీచేసిన కూరగాయల మార్కెట్ స్థలం కళాశాల ది కళాశాల కిచ్చి దానిలో బిజీ తరగతులు కోసం లెక్చరర్ వాళ్ళు నిర్మించాలని వారు ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.జిల్లా కోర్టు,ఐటి హభ్ లను విశాలమైన ప్రదేశాలకుతరలించే పక్షంలో ఆభవనాలను యస్ఆర్ బిజీయన్ఆర్ కళాశాల కు తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు.అనేక ఏండ్లుగా చెల్లించిన కాడా బిల్డింగ్ అద్దె ఉన్నతాధికారులు వద్ద పోగుపడి ఉన్నందున కళాశాల మరమ్మత్తులు కొరకు దానిని కళాశాల కు విడుదల చేయాలని కోరారు.కళాశాల భూరి విరాళం దాత గెంటేల నారాయణ రావు పేరును ఇల్లెందు రోడ్డుకు నారాయణరావు మార్గంగా ప్రకటించాలని,ఆయన విగ్రహాలు ఇల్లెందు క్రాస్ రోడ్డు,లేదా లకారం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని కోరారు.యస్ఆర్ &బిజీయన్ఆర్ కళాశాల ఔన్నత్యం పెంపుదల, అబివృద్ధి కోసం పూర్వ విద్యార్థి సంఘం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు.కార్యవర్గ సమావేశం లో యస్ఆర్ బిజీయన్ఆర్ కళాశాల పూర్వ విద్యార్థి సంఘం కార్యవర్గ సభ్యులు యస్.మణిభూషనాచారి,యం.గుట్టయ్య,ఊడుగు వెంకటేశ్వర్లు, నాళ్ళబానూచందర్,కట్టెకోల చిన నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments