కొలువైన వ్యవసాయ నూతన కమిటీ

స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా జులకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి ఎన్నిక

IMG-20241014-WA0034IMG-20241014-WA0033IMG-20241014-WA0035ప్రమాణ స్వీకారం చేసిన స్టేషన్ ఘనాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ల   

వ్యవసాయ నూతన కమిటీ సభ్యులు రైతులకు నీతివంతమైన సేవలు అందించాలి

కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు కలిసి స్టేషన్ ఘనపూర్ ను అభివృద్ధి చేసుకుందాం

పార్టీలో గ్రూపు రాజకీయాలు వద్దు పార్టీ లైన్ లో పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు

స్టేషన్ ఘనపూర్: తెలంగాణ ముచ్చట్లు

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం మార్కెట్ ప్రాంగణంలో ఈరోజు నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు, పాత గాంధీ సెంటర్ నుండి మార్కెట్ వరకు ర్యాలీని నిర్వహించి మార్కెట్ స్థలంలో ఏర్పాటుచేసిన సభాస్థలిలో కడియం శ్రీహరి సమక్షంలో నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, వైస్ చైర్మన్ గా నూకల ఐలయ్య, ఇతర డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత దక్కుతుందని మా విషయంలో అది రుజువైంది నా మీద నమ్మకంతో చైర్మన్ పదవి ఇచ్చిన కడియం శ్రీహరి కి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నుకోబడ్డ డైరెక్టర్లకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూనే కష్టపడి పని చేసే వారికి తప్పకుండా ప్రాధాన్యత ఉంటుందని అన్నారు, పైరవీల ద్వారా పదవులు రావని మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి పార్టీ జెండాను మోసిన వారికి క్రమశిక్షణతో పార్టీ లైన్లో పనిచేస్తున్న వారిని గుర్తించి ఇచ్చామన్నారు ఇందులో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారికే 80 శాతం మార్కెట్ కమిటీలో పదవులను ఇవ్వడం జరిగిందన్నారు మిగతా 20 శాతం మాత్రమే వారి యొక్క పనితనాన్ని గుర్తించి పదవులను ఇచ్చామన్నారు రాబోయే రోజులలో కూడా ఇందిరమ్మ ఇళ్లలో కానీ స్థానిక ఎలక్షన్లలో కానీ ఇదే పద్ధతి కొనసాగుతుందని తెలియజేశారు. ఈనాడు ప్రమాణస్వీకారం చేసిన డైరెక్టర్లలో నలుగురు బీసీలు ముగ్గురు ఎస్సీలు ఒకరు మైనారిటీ నుండి ఒకరు ఎస్టీ మిగతా వారందరూ జనరల్ కేటగిరి సంబంధించిన వారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అంటే వెనకబడిన బలహీన వర్గాలకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. ఎస్సీలకు సంబంధించి ఒకరికి అవకాశం ఉంటుంది కానీ నా నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం కాబట్టే ఎక్కువగా ఎస్సీలకు అవకాశం కల్పించే విధంగా ముగ్గురికి అవకాశం కల్పించడం జరిగిందన్నారు. 

*పార్టీ లైన్లో పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది*

చాలామంది కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడిన వారున్నారు మీరు గత ఎన్నికల్లో ఎంత కష్టపడ్డారు పూర్తి సమాచారం నా దగ్గర ఉందని పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేసే వారిని తప్పకుండా గుర్తించి ప్రతి ఒక్కరికి రాబోయే రోజులలో కచ్చితంగా చక్కెర భవిష్యత్తు మీకు ఉంటుందని అన్నారు. నేను కాంగ్రెస్ పార్టీలోనికి వచ్చిన తర్వాత గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసిన వారిని గుర్తించు కచ్చితంగా వారికి అవకాశం ఉన్న సమయంలో కచ్చితంగా పదవులు అందజేస్తానని చెప్పాను అదే రకంగా ఈరోజు చేశానన్నారు.  నన్ను నమ్మి నాతోపాటు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కార్యకర్తలు అందరూ నాపై కోపంగా ఉన్నారు ఎందుకంటే మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం ఈరోజు మాకు ఎలాంటి పదవులు లేకుండా మమ్మల్ని పక్కన పెట్టేస్తున్నారన్న భావనతో వారు ఉన్నారు అయినా వారితో నేను చెప్పాను మనం కాంగ్రెస్ పార్టీలోకి రాకపోయినా ఈ పదవులు కాంగ్రెస్ పార్టీకి వెళ్లవలసినవి కాబట్టి వాళ్లకి ఈ పదవులు వెళ్లడమే సరైనదని చెప్పి అందరితో మాట్లాడిన మాట మీద గౌరవం ఉంచి నా మాటను వినండి అని చెప్పానన్నారు.కొందరికి అవకాశం రాకపోవచ్చు వ్యక్తిగతంగా రాకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో పార్టీకి వచ్చిందనుకొని ఎన్నికైన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని గుర్తించాలన్నారు.  పదవులలో గాని కాంట్రాక్టు విషయంలో గాని మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని ఉన్నవాళ్ళకు తప్పకుండా అన్ని అందుతాయి భరోసా ఇచ్చారు. 

*అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం*

జాతీయ నాయకుల సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్టేషన్గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే దిశగా పని చేస్తానన్నారు. రాజకీయాలు గ్రూపులో అవసరం లేకుండా పార్టీ కోసం పనిచేయాలన్నారు గ్రామాలలో పనిచేయుని వ్యక్తులకు అవకాశాలు ఉండవన్నారు. పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు తప్పకుండా అవకాశం కల్పిస్తాం అన్నారు గ్రూపులు లేకుండా అందరం కలిసి నియోజకవర్గం కోరారు. ఒకటిన్నర సంవత్సరం ఒక్కో మండలానికి ఒక ఏజెండాతో పనిచేయాలని దాని ప్రకారమే మన స్టేషన్గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోనికి తీసుకువెళ్లే విధంగా కార్యాచరణా రూపుదిద్దుతున్నానన్నారు. ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభమవుతున్నాయి కాంట్రాక్టర్ ని పిలిపించి టెండర్లు ప్రకటించి పనులు ఆరంభం చేస్తామని నియోజకవర్గంలో పనులు చేపడతానని అన్నారు. ఈ ఐదు సంవత్సరాలలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన యజెండాను కచ్చితంగా అమలుపరచి తీరుతానన్నారు. అనవసరంగా సోషల్ మీడియాకు వెళ్లి గ్రూపు రాజకీయాలు చేసి పార్టీని బదనం చేయొద్దని దాని ద్వారా పార్టీకి క్షేమము కాదన్నారు. 

*ప్రాముఖ్యత లేదంటూ పరేషాన్ కావొద్దు*

నను స్టేజీల మీదికి పిలువలేదంటూ పార్టీలో ఎలాంటి అభ్యంతరాలు వెల్లడి చేయొద్దని ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది అందరిని స్టేజి మీదకి పిలిచే విధంగా కార్యాచరణ చేస్తానన్నారు. గతంలో ఉన్న మార్కెట్ చైర్మన్లు చాలామంది అందరూ ఈ మార్కెట్ యాడ్ అభివృద్ధి కొరకు పాటుపడ్డారన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో సాగునీరు లేక పంటలు పండగ పోయేది. ఇప్పుడు సాగుకు నీరు అందుతుంది చాలా పంటలు పండుతున్నాయి రైస్ మిల్లులు పెరిగాయి ధాన్యం పెరిగింది రైతులందరూ కూడా మార్కెట్ యార్డ్ ను ఉపయోగించుకోవాలని సూచించారు. పథకాలను పదవుల అమ్ముకునే వాన్ని కాదని ఏ ఒక్కరి దగ్గర లంచం తీసుకున్నట్టు నేను ఎరుగనని నమ్మకముతో స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ప్రజలు కడియం శ్రీహరి అనే నన్ను ఓట్లు వేసి ఎన్నుకున్నారని గుర్తు చేశారు.

 *నీతిగా రైతులకు సేవలందించాలి*

ఇప్పుడు ఎన్నుకోబడ్డ వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు అందరికీ అందుబాటులో ఉండాలని కాంట్రాక్ట్ ఇస్తామని ఒత్తిడి తీసుకొచ్చేవారు గతంలో ఉండేవారని ఇప్పుడు అలాంటి కార్యక్రమాలు చేపడితే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదన్నారు ఒక నీతివంతమైన నిజాయితీతో కూడిన సేవలు అందించే విధంగా మీ అందరూ సహకరించాలన్నారుఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జూలుకుంట శిరీష్ రెడ్డి, చిల్పూర్ మండల అధ్యక్షుడు గడ్డమీద సురేష్, జఫర్గడ్ మండల అధ్యక్షుడు, నూతన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, డైరెక్టర్లు భూక్య సురేష్, మదిరెడ్డి యశ్వంత్, నీలా వెంకటేశ్వర్లు, వాస్కుల కిరణ్, మారపాక వసంత, మహమ్మద్ అయుష బేగం, కాసాని బొందయ్య, ఇల్లందుల బాబు, పెరళ సుధాకర్, మాచర్ల కుమారస్వామి, గోలి శ్రీనివాస్, వెలమజాల రాంరెడ్డి, మండలాల అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .