మండల వ్యవసాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి
Views: 5
On
తెలంగాణ ముచ్చట్లు, మందమర్రి:-
మండల వ్యవసాయ శాఖ అధికారులు సమయపాలన పాటించకుండా, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బచ్చలి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మండల వ్యవసాయ అధికారులు రైతుల పంట పొలాలలో పర్యవేక్షణ చేయకుండా, రైతుల సమస్యలను పట్టించుకోకుండా, చూసి చూడనట్లుగా నిర్లక్ష్యంగా
వ్యవహరిస్తున్నారనిఆరోపించారు.అదేవిధంగామండలంలోని ఎరువుల షాపుల పై తనిఖీలు నిర్వహించకుండా, వాటి అక్రమాలకు కొమ్ము కాస్తున్నారన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments