ప్రణాళిక అమలు, నర్సరీల పెంపకంపై చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ ముచ్చట్లు, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
జి
ల్లాలో ప్రణాళిక విధానం అమలు, నర్సరీల పెంపకంపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 2024-25 సంవత్సరానికి గాను నిర్దేశించిన ప్రణాళిక విధానం అమలుతో పాటు నర్సరీల పెంపకంపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ క్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఎపిఓలు, ఈసి లకు శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రణాళిక విధానంలో 2024-25 సంవత్సరానికి గాను పనులు గుర్తించాలని, గ్రామపంచాయతీల వారిగా లేబర్ బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ప్రతి గ్రామపంచాయతీకి అవసరం మేరకు పనుల ఎంపికకు చర్యలు తీసుకోవాలని, 266 పనుల నుండి ఆయా గ్రామపంచాయతీలకు అవసరమైన పనులను గుర్తించాలని, గుర్తించిన పనులను నవంబర్ 30వ తేదీ వరకు గ్రామ, మండల స్థాయిలో ఆమోదంతో జిల్లా కార్యాలయానికి పంపించాలని అధికారులను ఆదేశించారు. నర్సరీల పెంపకంలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీకి నర్సరీ స్థలాన్ని ఈ నెల 5వ తేదీ లోగా గుర్తించాలని, గ్రామపంచాయతీల వారిగా డిమాండ్ కలెక్షన్ గుర్తించి జిల్లా కార్యాలయానికి ఈ నెల 5వ తేదీ లోగా పంపించాలని, విత్తనాల ఎంపిక, నీడ, ప్రైమరీ బెడ్ల ఏర్పాట్లు తగు సమయంలో జరుగాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 2 సంవత్సరాల కాలానికి అవసరమైన మొక్కలను ప్రణాళిక బద్ధంగా సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అటవీ భూములు, పోడు భూముల సమీపంలో గల నర్సరీలలో వెదురు మొక్కలు పెంచాలని, వెదురు మొక్కల పెంపకంతో ఆర్థికంగా లాభదాయక ప్రయోజనాలు ఉన్నాయని, నాణ్యమైన మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని తెలిపారు. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఇందుకు గాను అన్ని రకాల సామాగ్రి అందుబాటులో ఉన్నాయని, కొరత ఉన్న ప్రాంతాలలో ఉపాధిహామీ పథకం నుండి తీసుకొని పనులు పూర్తి చేయాలని తెలిపారు. వరదల కారణంగా దెబ్బతిన్న సిసి రోడ్లు, కల్వర్టులు, అంతర్గత రహదారుల మరమ్మత్తు పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని, గిరిజన గ్రామాలకు త్రాగునీరు, పాఠశాల, ఆసుపత్రి, రహదారి సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆశ్రమ పాఠశాలల్లో ఏమైనా మరమ్మత్తు పనులు ఉన్నట్లయితే పూర్తి వివరాలతో నివేదిక రూపొందించి అందించాలని, గిరిజన సంక్షేమ వసతి గృహాలు అవసరమైన ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments