విద్యతో పాటు పిల్లలకు విలువలు, క్రమశిక్షణ నేర్పాలి
అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్
-ఏన్కూర్ మండల కేంద్రంలో కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువు కుంటున్న పిల్లలకు చిన్నతనం నుంచే విద్యతో పాటు క్రమశిక్షణ, మంచి విలువలు మొదలైనవి నేర్పించాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ తెలిపారు. ఆదివారం అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ ఏన్కూర్ మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని కిచెన్, డార్మెటరీ మొదలగు ప్రదేశాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థినులకు విద్యా బోధన చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో బాలికలకు మంచి విద్యతో పాటు క్రమశిక్షణ విలువలు నేర్పాలని తెలిపారు. చిన్నతనం నుంచి మంచి విలువలతో కూడిన మోరల్ కథలు బోధించాలని అదనపు కలెక్టర్ సూచించారు.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలని అన్నారు.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 10వ తరగతి విద్యార్థినులు పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్, ఓటరు నమోదు, మార్పులు చేర్పులకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన, స్వీకరణకై చేపడుతున్న ఇంటింటి సర్వే ప్రక్రియను తనిఖీ చేశారు. ప్రక్రియ వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments