రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ షెడ్యూల్లో మార్పు.. పూర్తి వివరాలు ఇవే.
విశాఖపట్నం - సికింద్రాబాద్ల మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు షెడ్యూల్లో అధికారులు స్వల్ప మార్పు చేయాలని నిర్ణయించారు. పెరుగుతున్న ప్రయాణ డిమాండ్కు అనుగుణంగా, ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ తెలిపింది. విశాఖపట్నం-సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెప్రెస్ (20833/20834) షెడ్యూల్లో స్వల్ప మార్పు చేయనున్నట్టుగా పేర్కొంది. ఈ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు డిసెంబర్ 10 నుంచి ఆదివారం కాకుండా, మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుందని అధికారులు తెలిపారు.
అంటే డిసెంబర్ 10 నుంచి విశాఖపట్నం-సికింద్రాబాద్- విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ (20833/20834) మంగళవారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు రాకపోకలు సాగించనుంది. ఇక, సికింద్రాబాద్ - విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ (20707 /20708) ప్రస్తుతం ఉన్నట్టుగానే గురువారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు సేవలు అందించనుంది.
*వందేభారత్ ఎక్స్ప్రెస్..*


Comments