శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.66కోట్లు..నేడు వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే!

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.66కోట్లు..నేడు వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించిపోతాయని భక్తుల నమ్మకం.ఈ ఆలయం విష్ణువు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడిందిగా పురాణాలు చెప్తున్నాయి. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిసాడని నమ్ముతారు. అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆయన సేవలో తరించేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 26కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఇదిలా ఉంటే రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటలకుపైగా సమయం పడుతుంది. మరోవైపు టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది.

నేటి శ్రీవారి సేవలు

ఇదిలా ఉంటే నేడు తెల్లవారు జామున 2.30 గంటల నుంచి 3 గంటల వరకు సుప్రభాత సేవ... 3.30 గంటల నుంచి 4 గంటల వరకు తోమల సేవ ఉంటుంది. అలాగే 4 గంటల నుంచి 4.15 వరకు కొలువు మరిచు పంచాంగ శ్రవణం ఉంటుంది. ఉదయం 4 గంటల నుంచి 4.30 వరకు తొలి అర్చన. సహశ్రనామ అర్చన సేవ ఉంటుంది. 6.30 గంటల నుంచి 7 గంటల వరకు బలి మరిచు సత్తుముర సేవ నిర్వహిస్తారు.

ఏకాంత సేవ

సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శుద్ధి రాత్రి పూట కైంకర్యం(ఏకాంతం) సేవ ఉంటుంది. అర్థరాత్రి 1 నుంచి 1.30 వరకు శుద్ధి ఏకాంత సేవ ప్రిపరేషన్ ఉంటుంది. 1.30 నుంచి ఏకాంత సేవ ఉంటుంది.

 

 

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .