ఏటీసీలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

ఏటీసీలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

 

తెలంగాణ ముచ్చట్లు, మందమర్రి:-

ప్రస్తుత పారిశ్రామిక సంస్థలకు నైపుణ్య మానవ వనరులను అందించడమే లక్ష్యంగా, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా టాటా టెక్నాలజీ సహకారంతో నూతనంగా నిర్మించబడిన అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ)లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుందని పట్టణ ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ జి దేవానంద్ సోమవారం ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏటీసీ కేంద్రంలో ఆరు కోర్సులు నిర్వహిస్తుండగా, అందులో మూడు కోర్సులు ఒక సంవత్సరం కాలవ్యవధి, మిగిలిన మూడు కోర్సులు రెండు సంవత్సరాల కాలవ్యవధి కలిగి ఉన్నాయని తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 14 నుండి అక్టోబర్ 19 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఐటిఐ వెబ్సైట్ లో అన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అనంతరం కళాశాల పని వేళలో కళాశాలలో సంప్రదించాలని తెలిపారు. జిల్లాలో 25 ఐటిఐ కళాశాలలు ఉండగా, కేవలం పట్టణ ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో మాత్రమే ఏటీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఆసక్తి గల 10వ తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనిసూచించారు.మరిన్నివివరాలకు7013846573, 9154549697,9885981959నెంబర్లనుసంప్రదించాలన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .