వైభవంగా కలెక్టరేట్ లో బతుకమ్మ వేడుకలు.....
Views: 7
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
బతుకమ్మ సంబరాల్లో భాగంగా గురువారం రెండోరోజు కలెక్టరేట్ లో నిర్వహించిన అటుకుల బతుకమ్మ వేడుకలలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ పాల్గొని ఉద్యోగులు, జిల్లా అధికారులతో కలిసి బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.ఎస్సీ, ఎస్టీ, బి.సి., మైనారిటీ తదితర సంక్షేమ శాఖల ద్వారా చేపట్టిన అటుకుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా బతుకమ్మ లు పేర్చి ఆడుతూ, పాడుతూ తెలంగాణ సంస్కృతి చాటి చెప్పే విధంగా వైభవంగా వేడుకలు జరిపారు. ప్ర
భుత్వ ఆదేశాల ప్రకారం మన సంస్కృతి ప్రతిబింబించేలా ఘనంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పెద్ద ఎత్తున ఉద్యోగులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments