సర్వజ్ఞ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

సర్వజ్ఞ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు: 

IMG-20241005-WA0026మ్మం నగరంలో స్థానిక వి.డి.వోస్ కాలనీలోని సర్వజ్ఞ పాఠశాలలో శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్వజ్ఞ పాఠశాల ఈ సంబురాలకు వేదిక అయినది. ఈ వేడుకలో చిన్నారులు పట్టు వస్త్రాలను ధరించి బాగా ముస్తాబై తంగేడు, బంతి, చేమంతి పువ్వులతో, బతుకమ్మలను తయారుచేసి గౌరమ్మను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పాటలు పాడుతూ, ఆడుతూ చప్పట్లు కొడుతూ విద్యార్థునులు, ఉపాధ్యాయినులు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుక కనులవిందుగా సాగిందిపాఠశాల డైరెక్టర్ నీలిమ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణా స్త్రీలకు అతి ఇష్టమైన, ముఖ్యమైన పండుగ అని మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని, తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను ఆడుతారని, తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన ఈ పండుగను ప్రాచీనకాలం నుండి సాంప్రదాయకంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు. మహిళలకే పరిమితమైన ఈ పండుగ ఒకరి మధ్య ఒకరికి స్నేహభావాన్ని పెంపొందించుకోవటానికి దోహదపడుతుందనీ, ఈ తరం విద్యార్థులకు మన సంస్కృతీ, సాంప్రదాయాలపట్ల గౌరవం మరియు అవగాహన కలిగించుటకు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. పాఠశాల డైరెక్టర్ ఆర్.వి నాగేంద్రకుమార్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ అని, పూలు బాగా వికసించేకాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది అని చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా జరుపుకుంటారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ నీలిమ, ఆర్. వి నాగేంద్రకుమార్, పాఠశాల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు మరియు ఉపదధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .