బీసీ కమిషన్ చైర్మన్ గోపిషెట్టి నిరంజన్ నీ కలిసిన ఆర్టీఐ కమిటీ
హైదరాబాద్ ఎల్.బి నగర్,తెలంగాణ ముచ్చట్లు :
బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ ను, బీసీ కమిషన్ మెంబర్ తిరుమలగిరి సురేందర్ లను ఖైరతాబాద్ లోని వారి ఆఫీసులో ఆర్టిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్,రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సూర స్రవంతి, రాష్ట్ర కార్యదర్శి గుండెల రాయుడు గురువారం మర్యాదపూర్వకంగా కలిసారు. సమాచార హక్కు చట్టాన్ని బలోపేతం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని బీసీ కమిషన్ ఛైర్మన్ నీ ఈ సందర్భంగా కోరారు. అక్టోబర్ నెల చివరలో నిర్వహించే ఆర్టీఐ ఆవిర్భావ వేడుకలకు,అవగాహన సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు.
రాష్ట్రంలో ప్రజలకు, విద్యార్థులకు ఆర్టిఐ అవగాహన సదస్సులు పెట్టి ప్రజలను మరింత చైతన్యవంతులను చేయాలని, దీనికి మీ సహాయ సహకారాలు కావాలని విన్నవించారు. దీనికి ఆయన ఇలాంటి అవగాహన కార్యక్రమాలు పెట్టడం ప్రజలకు ఆర్టీఐ గురించి వివరించే కార్యక్రమం పెట్టడం చాలా బాగుంటుందని ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆర్టీఐ బృందం ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Comments