కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా బిఆర్ఎస్ పార్టీ

బిఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్

కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా బిఆర్ఎస్ పార్టీ

తెలంగాణ ముచ్చట్లు, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:

బిఆర్ఎస్ పార్టీకి వెన్నుముకగా నిలుస్తున్న పార్టీ కార్యకర్తలకు, వారి కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని బిఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ నాయకులు డాక్టర్ రాజా రమేష్ తెలిపారు. జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త మృతి చెందగా సోమవారం పట్టణంలో కార్యకర్త కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రమాద బీమా రెండు లక్షల రూపాయల చెక్కును కార్యకర్త కుటుంబానికి అందజేయడం జరిగిందని, కార్యకర్త కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్, బిఆర్ఎస్ నాయకుడు పారిపెల్లి తిరుపతి, పార్టీ నాయకులు బడికెల సంపత్ వంశీకృష్ణరావు, రవి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .