AI ఎఫెక్ట్‌.. సిస్కోలో వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు..  ఆరు నెలల్లో రెండో సారి..!

AI ఎఫెక్ట్‌.. సిస్కోలో వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు..   ఆరు నెలల్లో రెండో సారి..!

డెస్క్ తెలంగాణ ముచ్చట్లు :

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో లేఆఫ్స్‌ (Layoffs) పర్వం కొనసాగుతోంది. మాంద్యం భయాల కారణంగా ఇప్పటి వరకూ వందలాది సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. అయితే, ఇప్పుడు ఏఐతో పాటు ఆధునిక ఐటీ సొల్యూషన్స్‌పై దృష్టి సారించే క్రమంలో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటికే పలు సంస్థలు ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటించాయి. రెండు రోజుల క్రితం డెల్‌ టెక్నాలజీస్‌ కూడా భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మందిని ఏకంగా 12500 మందిని డెల్‌ విధుల నుంచి తొలగించింది.

ఇప్పుడు మరో సంస్థ కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ కంపెనీ సిస్కో (Cisco Layoffs) భారీగా కొలువుల కోత‌కు ప్రణాళిక‌లు రూపొందిస్తున్నట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో ఉద్యోగుల‌ను తొల‌గిస్తూ వ్యాపార పున‌ర్వ్యవ‌స్థీక‌ర‌ణ‌కు పూనుకున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో దాదాపు 4,000 మందికి లేఆఫ్‌లు ప్రకటించిన ఈ సంస్థ తాజాగా అదే సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమైనట్లు (second round of layoffs) తెలిసింది. ఆరు నెలలు గడవకముందే మళ్లీ కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

వ్యాపారంలో డిమాండ్ తగ్గడం, సరఫరా చైన్‌లో సమస్యల కారణంగానే కంపెనీ ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటోంది. మరోవైపు 2025 నాటికి ఏఐ ఉత్పత్తుల ఆర్డర్‌లో బిలియన్‌కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఉద్యోగులను తగ్గించుకొనేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు రాయిటర్స్‌ నివేదించింది. కాగా, సిస్కోలో ప్రపంచ‌వ్యాప్తంగా 84,900 మంది ప‌నిచేస్తున్నట్లు అంచనా. తాజా కొలువుల కోతతో ఈ సంఖ్య భారీగా త‌గ్గనుంది.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

పాలాభిషేకాలతో కృతజ్ఞతలు.. రూ.45 కోట్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. పాలాభిషేకాలతో కృతజ్ఞతలు.. రూ.45 కోట్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.
- ప్రణవ్ బాబు కృషితో సాధ్యమైన అభివృద్ధి: కాంగ్రెస్ నేతల హర్షం - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రణవ్ బాబుకు పాలాభిషేకం జమ్మికుంట టౌన్ జూన్...
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి.. కార్మికులకు అండగా నిలిచిన మున్సిపల్ చైర్మన్.
భావితరాలకు హరిత వారసత్వమే లక్ష్యం!
ఖమ్మంలో ఘనంగా టాలీ సర్టిఫైడ్ పార్టనర్ సంస్థ ఆఫీస్ ప్రారంభం.
ముడిసరుకు ధరల భారం.. జమ్మికుంటలో ఫోటోగ్రాఫర్ల బంద్ జయప్రదం"
ఇందిరమ్మ ఇళ్లలో ఆనంద దీపాలు.. గృహ ప్రవేశాల్లో పాల్గొన్న వొడితల ప్రణవ్.
గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం.