గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ వాడుతున్నారా..? 

కీలక హెచ్చరికలు చేసిన కేంద్ర ప్రభుత్వం..!

గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ వాడుతున్నారా..? 

డెస్క్ తెలంగాణ ముచ్చట్లు:

యూజర్లకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. క్రోమ్‌ బ్రౌజర్‌లో అనేక బగ్‌లో ఉన్నాయని.. వాటిని హ్యాకర్లు ఉపయోగించుకోవచ్చని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెనీ రెస్పాన్స్‌ టీమ్‌ (CERT-In) పేర్కొంది. గూగుల్‌ యూజర్లు క్రోమ్‌ బ్రౌజర్‌ను వెంటనే అప్‌డేట్‌ చేయాలని సెర్ట్‌ ఇన్‌ సూచించింది. క్రోమ్‌ వెబ్‌ బ్రౌజర్‌లో చాలా లోపాలు ఉన్నాయని.. వాటిని వాడుకొని హ్యాకర్లు సిస్టమ్స్‌ను రిమోట్‌లోకి తీసుకొని నియంత్రించే అవకాశం ఉంటుందని పేర్కొంది.

సిస్టమ్‌లో స్టోర్‌ చేసి పెట్టుకొని కీలకమైన డేటాను కాపీ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. సిస్టమ్‌ను రిమోట్‌గా షట్‌డౌన్‌ చేయవచ్చని.. గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్‌లో సేవ చేసుకున్న అన్ని పాస్‌వర్డ్‌లను సైతం తస్కరించేందుకు ఛాన్స్‌ ఉందని పేర్కొంది. అంతటితో ఆగకుండా మాల్వేర్‌ను నెట్‌వర్క్‌తో పాటు కంప్యూటర్‌లో చొప్పించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. విండోస్‌, మ్యాక్‌ యూజర్లు తప్పనిసరిగా గూగుల్‌ క్రోమ్‌ 127.0.6533.88/89కి అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. క్రోమ్‌ బ్రౌజర్‌ను ఆటోమేటిక్‌ అప్‌డేట్‌ మోడ్‌లో ఉంచాలని.. తద్వారా ఎప్పటికప్పుడు లోపాలను నివారించవచ్చని చెప్పింది.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .