రియల్‌మీ తన సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని లాంచ్ చేయనుంది

రియల్‌మీ తన సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని లాంచ్ చేయనుంది

హైదరాబాద్ తెలంగాణ ముచ్చట్లు:

 320W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కంపెనీ రూపొందించింది. ఈ టెక్నాలజీ ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే ఫోన్ పూర్తి ఛార్జ్ కానుంది.ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ తన కొత్త సూపర్‌సోనిక్ ఛార్జ్ టెక్నాలజీని రేపే ప్రారంభించబోతోంది. ఈ టెక్నాలజీతో కేవలం ఐదు నిమిషాల్లోనే స్మార్ట్ ఫోన్ 100 శాతం ఛార్జ్ అవుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మొబైల్ ఛార్జింగ్‌ టెక్నాలజీ. దీన్ని కంపెనీ రేపు (ఆగస్టు 14వ తేదీ) తీసుకురానుంది. ఇంతకుముందు కంపెనీ 300W ఫాస్ట్ ఛార్జింగ్‌ను తీసుకురాబోతోందని అందరూ భావించారు. అయితే 320W సూపర్‌ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీని తీసుకురాబోతున్నట్లు రియల్‌మీ తెలిపింది. ఈ టెక్నాలజీ రాకతో స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జింగ్ చేయడం చాలా వేగవంతం కానుంది.

రియల్‌మీ రూపొందించిన ఈ ఫాస్ట్ ఛార్జర్ గత సంవత్సరం తమ కంపెనీనే ప్రవేశపెట్టిన 240W ఫాస్ట్ ఛార్జ్‌కు టెక్నాలజీ పరమైన అప్‌డేట్ నవీకరణ. రియల్‌మీ గత ఏడాది లాంచ్ చేసిన జీటీ 5 మొబైల్‌తో ఈ ఛార్జింగ్ టెక్నాలజీని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ టెక్నాలజీ ద్వారా కేవలం 80 సెకన్లలోనే 20 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

రేవంత్ రెడ్డి రాక్షసుడంటూ రాజయ్య ఫైర్. రేవంత్ రెడ్డి రాక్షసుడంటూ రాజయ్య ఫైర్.
3,146 కొత్త గ్రామపంచాయతీల గుర్తింపు కేసీఆర్‌దే  కడియం శ్రీహరి తన బిడ్డల భవిష్యత్తు కోసం నియోజకవర్గాన్ని వాడుకుంటున్నాడు: రాజయ్య స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):...
ఘనంగా నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు.
కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం.
భగత్‌నగర్ అభివృద్ధికి రూ.60 లక్షలు.
టెండర్ల నిబంధనల్లో పారదర్శకత ఏదీ?
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.