ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

ఘనంగా బతుకమ్మ సంబరాలు

 

 

 

 

మునిసిపల్, సంక్షేమ శాఖలచే నిర్వహించిన బతుకమ్మ సమరాల్లో పాల్గొన్న నగర మేయర్ పునుకొల్లు నీరజ

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు 

తొమ్మిది రోజుల పాటు సాగే ఆటపాటల పండుగ బుధవారం ఎంగిలిపూల బతుకమ్మతో ఆరంభమైంది.

ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఖమ్మం కార్పొరేషన్, మెప్మ మహిళా ఉద్యోగులు, స్వయం సహాయక సంఘం మహిళలు, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మహిళా ఉద్యోగులు అందరూ కలిసి ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయం నందు బతుకమ్మ మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

నగర మేయర్ పునుకొల్లు నీరజ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ,కుటుంబ సభ్యులందరిని ఒక దగ్గరికి చేర్చి, ప్రకృతితో మమేకమయ్యేలా చేసే పండుగ బతుకమ్మ అని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ అని మేయర్ తెలిపారు. తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక బతుకమ్మ అని, బంధాలను, అనుబంధాలను గుర్తుచేస్తూ, ప్రకృతి ని ఆరాధిస్తూ జరుపుకునే పూల పండుగ బతుకమ్మ అని మేయర్ అన్నారు. 

ఈ వేడుకల్లో జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, నగరపాలక సంస్థ సహాయ కమీషనర్ సంపత్ కుమార్, మహిళా అధికారులు, ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .