2 రోజుల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

2 రోజుల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.

 

రోటరీ నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు: 

డీఎస్సీ పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ రెండు రోజులలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు.గుIMG-20241003-WA0052రువారం స్థానిక రోటరీ నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపడుతున్న డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలో డీఎస్సీ అభ్యర్థుల వెరిఫికేషన్ కోసం 14 బృందాలను ఏర్పాటు చేశామని, ఇందులో ఎస్.జి.టి. పోస్టుల అభ్యర్థుల కోసం 8 బృందాలు, ఎస్.ఏ. పోస్టుల అభ్యర్థుల కోసం 6 బృందాలు ఏర్పాటు ఆయన చేసినట్లు తెలిపారు. డీఎస్సీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం 1:3 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేసిందని, ఖమ్మం జిల్లా పరిధిలో ఎస్.జి.టి. 508, స్కూల్ అసిస్టెంట్లు 855, ఎల్.పి. 49, పీఈటి లు 30 మంది మొత్తం 1442 మంది అభ్యర్థులు ఎంపిక అయ్యారని, వీరి సర్టిఫికెట్లను అవసరమైతే అదనపు బృందాలను ఏర్పాటు చేసి 2 రోజులలో వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, మండల విద్యాధికారి శ్రీనివాసరావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .