జిల్లాస్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించిన చింతనిప్పు కృష్ణ చైతన్య.
సంతోష్ మెమోరియల్ టోర్నీలో పాల్గొంటున్న 40 క్రికెట్ జట్లు.
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
స్థ
నిక ఎస్సార్ అండ్ బిజీ ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం సంతోష్ సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బలుసు మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంటును జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతనిప్పు కృష్ణచైతన్య ప్రారంభించారు. సంతోష్ మెమోరియల్ టోర్నమెంట్లో జిల్లా వ్యాప్తంగా పలు మండలాల నుంచి 40 క్రికెట్ క్రీడా జట్లు పాల్గొంటున్నాయి. టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతనిప్పు కృష్ణచైతన్య క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభ మ్యాచ్ ను టాస్ వేసి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ సంతోష్ మెమోరియల్ ట్రస్ట్ తరపున క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. జిల్లా నలుమూలల నుంచి పాల్గొన్న క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో గెలుపు ఓటములను స్పూర్తిగా తీసుకొని పోటీపడాలి అన్నారు. టోర్నమెంట్ ను నిర్వహిస్తున్న ట్రస్ట్ నిర్వాహకులు సామాజిక బాధ్యతతో క్రీడా, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతకు మార్గదర్శకంగా ఉంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్ సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బలుసు మురళీకృష్ణ , ట్రస్ట్ బాధ్యులు కోమటిల్లి సాయి కృష్ణ చైతన్య, కోనపర్తి గోపి, ఆలేటి వెంకటేష్, కొమ్ము మహేష్, కే సాయి, భరత్ చౌదరి, అభి, నాని, హనీష్, పి సాయి, సాయి చందు తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ పోటీల నిర్వహణతో కళాశాల మైదానమంతా కోలాహాలంగా మారింది.


Comments