ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అక్కినేని నాగచైతన్య నిశ్చితార్థం ఫోటోలే కనిపిస్తున్నాయి

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అక్కినేని నాగచైతన్య నిశ్చితార్థం ఫోటోలే కనిపిస్తున్నాయి

ఆగస్ట్ 8న చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం వేడుకగా జరిగిన సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాలు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. దీంతో అసలు చైతన్య, శోభితా ఎక్కడ పరిచయమయ్యారు ? ఎప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా చైతన్య, శోభితా ప్రేమ గురించి శోభితా చెల్లెలు సమంత చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.
హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల చెల్లెలి పేరు సమంత. ప్రస్తుతం ఆమె డాక్టర్ గా పనిచేస్తుంది. ఇదివరకే ఆమెకు పెళ్లి అయ్యింది. తాజాగా తన సోదరి శోభిత ధూళిపాళ్ల, నాగచైతన్య నిశ్చితార్థం ఫోటోస్ షేర్ చేస్తూ అసలు విషయం చెప్పేసింది. చైతూ, శోభితా ఎంగేజ్మెంట్ ఫోటోస్ షేర్ చేస్తూ 2022 నుంచి ఎప్పటికీ అంటూ రాసుకొచ్చింది. అంటే చైతూ, శోభితా ఇద్దరి ప్రేమకథ 2022లోనే స్టార్ట్ అయ్యిందని తెలియడంతో అభిమానులు, నెటిజన్స్ షాకవుతున్నారు.
కాగా.. చైతన్య 2017లో హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరిద్దరి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2021లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉన్న చైతూ 2022లో శోభితాతో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. చైతూ ప్రస్తుతం తండేల్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .