అరూరి రాజు ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
చిల్పూర్,తెలంగాణ ముచ్చట్లు:
మండలంలోని వంగాలపల్లి గ్రామంలో గురువారం ప్రముఖ సినీ నటుడు,
పద్మవిభూషణ్,మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను తెదాపా ఎస్సి సెల్ రాష్ట్ర నాయకులు ఆరూరి రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
చిరంజీవికి వీరాభిమాని అయినా రాజు చిరు బర్త్ డే సందర్భముగా భారీ కేకు కోసి తన అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆరూరి రాజు మాట్లాడుతూ ...
చిరంజీవి ఎంతో మందికి ఆదర్శనీయుడని,ఆయన బ్లడ్ బ్యాంకు,ఐ బ్యాంకు ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడారని,
ఆయన చేసిన ప్రజా సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.అంతటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరుపడం తనకు ఆనందంగా ఉందని అన్నారు.ఈ సందర్భంగా తన అభిమాన హీరో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో కుక్కలా మోహన్,గుడిపాటి రాజు,చింత రాజు,జిట్టా యాదగిరి,రాజారపూ రాజు,భూమరాజు,తెలంగాణ తెలుగుదేశం నాయకులూ,పార్టీ అభిమానులు,
చిరంజీవి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


Comments