*పారదర్శకంగా క్వార్టర్ల కౌన్సెలింగ్*

*పారదర్శకంగా క్వార్టర్ల కౌన్సెలింగ్*

 

 

*తెలంగాణ ముచ్చట్లు మందమర్రి:-*

ఏరియాలోని ఖాళీగా ఉన్న క్వార్టర్ల కేటాయింపు కొరకు సింగరేణి ఎన్సీడబ్యుఏ ఉద్యోగులకు పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సింగరేణి ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్ తెలిపారు. సోమవారం ఏరియాలోని సిఈఆర్ క్లబ్ లో క్వార్టర్ల కొరకు దరఖాస్తు చేసుకున్న కార్మికులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏరియాలో ఖాళీగా ఉన్న క్వార్టర్ల కేటాయింపు కొరకు మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలకు 90 క్వార్టర్ లను ప్రకటించగా, వీటికి 91 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని, దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు కౌన్సిలింగ్ నిర్వహించి, సీనియార్టీ ప్రకారం 26 మంది ఉద్యోగులకు క్వార్టర్లను కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంచార్జ్ ఎస్ఓటు జిఎం రవీందర్, ఐఈడి డిజిఎం రాజన్న, డివైపిఎం మైత్రేయ బంధు, ఏరియా పర్సనల్ విభాగం కార్యాలయ సూపరింటెండెంట్ రాజలింగు, సిబ్బంది, ఎస్ అండ్ పిసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .