హత్యాయత్నం కేసులో నిందితుడు అరెస్ట్
హసన్ పర్తి తెలంగాణ ముచ్చట్లు:
వరంగల్ పోలీస్ కమిషనరెట్ హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరదిలో
గత సంవత్సరం 2023 లో నమోదైన హత్యాయత్నం కేసులో నిందితుడు బలుస్కోరి వినయ్ అలియాస్ రిచ్ ను అరెస్టు చేసినట్లు హసన్ పర్తి సిఐ చేరాలు తెలియజేశారు. 2023 డిసెంబర్ లో జల్లి అక్షయ్ కుమార్ హసన్ పర్తి చెందిన వ్యక్తిని, నిందితుడు బలుసు కోరి వినయ్ అలియాస్ రిచ్ ఫోన్ చేసి రోడ్డుకు రమ్మని పిలిచి వైన్ షాప్ దగ్గర బీర్లు తీసుకొని తాగమని బలవంతం చేయగా అందుకు నిరాకరించిన అక్షయ్ కుమార్ ను ఇష్టం వచ్చినట్టు కొడుతూ ముఖంపై కొట్టగా రక్త గాయం కాగా, అగాయాన్ని కడుగుకునుటకు అక్షయ్ కుమార్ చికెన్ సెంటర్ దగ్గర గల నల్ల దగ్గరికి వెళ్ళగా వెంటనే చికెన్ సెంటర్ లో గల కత్తులను తీసుకొని అక్షయ్ కుమార్ పై హత్యాయత్నం చేయగా అట్టి హత్యాయత్నాన్ని అడ్డుకున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్న తుమ్మ లక్ష్మణ్ మరియు అతని భార్య లక్ష్మీ లను అదేవిధంగా అక్కడ బజ్జీలు తినడానికి వచ్చిన పూనం సురేష్ ను, చికెన్ సెంటర్ యజమాని అమీరుద్దీన్ ను విచక్షణ రహితంగా కొట్టి గాయపరిచినాడని ఫిర్యాదుపై నిందితుడు బలుస్కూరి వినయ్ పై హత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగిందని అప్పటినుండి నిందితుడు పోలీసుల నుండి తప్పించుకుంటూ తిరుగుతుండగా మంగళవారం వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు నిందతున్ని అరెస్ట్ చేసి, అతను హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తిని సీజ్ చేసినట్లు హసన్ పర్తి పోలీసులు తెలియజేశారు. నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్ గురించి పంపినట్లు తెలిపారు.


Comments