బైకు దొంగలు అరెస్ట్...
దొంగిలించిన బైకులను స్వాధీన పరుచుకుని ఇద్దరు వ్యక్తులను రిమాండ్ కు తరలించిన పోలీసులు
స్టేషన్ ఘనపూర్: తెలంగాణ ముచ్చట్లు
గురువారం రోజు ఉదయం పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఏ కుమార్ సిబ్బందితో రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర సెర్చ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులను వారి దగ్గర ఉన్న బైకులను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం స్థానిక సీఐ జి వేణు మాట్లాడుతూ వీరిని విచారించగా బండి శ్రీకాంత్ తండ్రి కుమార్ (28) పల్లగుట్ట గ్రామం చిల్పూరు మండలానికి చెందిన వ్యక్తిగాను శివరాత్రి ప్రవీణ్ తండ్రి సారయ్య, గా రెండవ వ్యక్తి గుర్తించినట్లు చెప్పుకొచ్చారు.స్టేషన్ ఘనాపూర్ గ్రామం మండలం స్టేషన్ ఘనపూర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించామని ఇవే కాకుండా వారి వద్ద గతంలో చాగల గ్రామంలో ఒక బైకును దొంగిలించారని అదే కాకుండా హీరో హోండా బైకును గత దొంగిలించి గుర్తించామన్నారు కాజిపేట్ బోడగుట్ట వద్ద రెండు బైకులను నల్గొండ జిల్లాలోని నూతకల్ వద్ద ఒక బైకును దొంగిలించిన ఈ బైక్ లను (ఐ )తమ్మడపల్లి గ్రామానికి చెందిన వినోద్ కుమార్ అలియాస్( ముని) తండ్రి ఎల్లయ్య వద్ద కుదోపెట్టినట్టుగా గుర్తించమన్నారు. ఇద్దరి దగ్గర మొత్తం ఆరు బైక్లను స్వాధీనం చేసుకుని ఒక లక్ష 50,000 రూపాయల విలువ ఉంటుందని అన్నారు ఇట్టి ఇద్దరు వ్యక్తుల పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టుగా సి ఐ జి వేణు వెల్లడించారు.
చాకచక్యంతో దొంగలను పట్టుకున్న ఎస్సై వినయ్ కుమార్ పోలీస్ సిబ్బంది ప్రసాద్ మారుతి కుమార్ శ్రీనివాస్ లను అభినందించారు


Comments