వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పని సరి:ఎస్సై బి.రామ్ చరణ్

వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పని సరి:ఎస్సై బి.రామ్ చరణ్

తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:

మండల పరిధిలోని గ్రామాల్లో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరని ఎస్సై బి. రామ్ చరణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ...రోడ్ల మీద ,చిన్న చిన్న వీధుల్లో కాకుండా, ప్రజలకు ఇబ్బంది కలగని ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. అలాగే మండపాలను పగడ్బందిగా నిర్మించుకోవాలని, మండపాల వద్ద అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని తెలిపారు.అదే విధంగా ఎక్కువ శబ్దం వచ్చేలా పాటలు పెట్టవద్దని, స్థలం యజమాని, విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలని కోరారు. అంతేకాకుండ డిజెలకు అనుమతి ఇవ్వబడదని అన్నారు. మండపం వద్ద నిర్వాహకులు ఎప్పటికి అందుబాటులో ఉండాలని సూచించారు.అత్యవసర పరిస్థితిలో డయల్ 100ద్వారా గానీ, నేరుగా సమాచారం ఇవ్వాలని పేర్కోన్నారు. పోలీస్ వారి నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని తెలిపారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .