పెద్దమందడి నూతన ఎస్సైని సన్మానించిన బిజెపి నాయకులు
శాంతి భద్రతలను కాపాడటంలో పోలీస్ శాఖకు సహకరిస్తాం
Views: 25
On
--- బిజెపి మండల అధ్యక్షుడు తిరుపతయ్య
వనపర్తి జిల్లా ప్రతిని తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన యుగేందర్ రెడ్డిని గురువారం బిజెపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బిజెపి మండల అధ్యక్షుడు తిరుపతయ్య ఆధ్వర్యంలో బిజెపి నాయకులు ఎస్సై యుగంధర్ రెడ్డి ని కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ.... మండలంలో శాంతిభద్రతలు కాపాడటంలో బిజెపి పార్టీ అన్ని రకాలుగా సహకరిస్తామని తెలిపారు. చట్టాల పరిరక్షణకు మీ వంతు సహకారం అందించాలని ఎస్సై యుగంధర్ రెడ్డి నాయకులను కోరారు. కొత్త కాపు శివారెడ్డి, ముప్పూరి చెన్నయ్య, యాదయ్య, రామ్ నరేష్, వెంకటేష్, వెంకటయ్య, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments