ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను సన్మానించిన పోలీస్ కమిషనర్

ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను సన్మానించిన పోలీస్ కమిషనర్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో భాద్యతయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖ కు ఎనలేని సేవలతో పోలీస్ శాఖ మన్ననలు పొందారని పోలీస్ కమిషనర్ కొనియాడారు. రిటైర్ మెంట్ తన వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదని, మీ విధినిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.  

*ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులు*

సిహెచ్‌.వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ 

కె. వెంకటేశ్వర్లు, ఏఎస్‌ఐ 

వి. రామారావు, ఏఎస్‌ఐ

డి.వి. నారాయణ, ఏఎస్‌ఐ

షేక్. బీజాపూర్ ఫరూక్, ఏఆర్ఎస్‌ఐ

టి. వెంకటేశ్వర్లు, హెచ్ సి

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నరేష్ కుమార్, అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు, ఏ ఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, ఆర్ ఐ కామరాజు , రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వేంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .