గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం ప్రాంతాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్

గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం ప్రాంతాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు: 

గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం పురస్కారించుకొని ఖమ్మం నగరంలోని కాల్వవోడ్డు మున్నేరు, ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా వైపు మున్నేరు వద్ద జరిగే నిమజ్జనం 

ప్రాంతాలను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించి పలు సూచనలు చేశారు. నిమజ్జన ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రేన్లు, ఫ్లడ్ లైట్లు, మార్గాలు, బారికేడింగ్ తదితర అంశాలపై చర్చించారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు వుండాలని, సీసీ కెమెరాలను కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం అయ్యేలా చూసుకొవాలని సూచించారు. మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్‌, పోలీసులతో పాటు అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా శోభాయాత్ర, నిమజ్జనం జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో సహకరించుకోవాని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు, ఏసీపీలు రమణమూర్తి, శ్రీనివాసులు సిఐలు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .