మహిళా జర్నలిస్టులపై దాడి చేసిన దోషులను శిక్షించాలి
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో ఇద్దరు మహిళ జర్నలిస్టులపై కొందరు దుండగులు దాడికి పాల్పడటంపై వనపర్తి జిల్లా టీయూడబ్ల్యూజే జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం రాత్రి వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ లో జర్నలిస్టులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా టీయూడబ్ల్యూజే 143 యూనియన్ అధ్యక్షులు బక్షి శ్రీధర్ మాట్లాడుతూ సీఎం సొంత గ్రామంలో మహిళా జర్నలిస్టులపై దాడి చేయటం జర్నలిస్ట్ లోకాన్నిఆవేదనలో ముంచిందన్నారు. పోలీసులు దుండగులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు ఏ విధంగా జరుగుతున్నాయే అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఈ అంశంపై పూర్తి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించి జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పాలని కోరారు.ఇలాంటి సంఘటనలు అమరావృతం కాకుండా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టియూడబ్ల్యూజే 143 యూనియన్ నాయకులు దిండి నగేష్, రాష్ట్ర నాయకులు వి. నరసింహ రెడ్డి.మోడల చంద్రశేఖర్, జానాయ్య , సుంకరి రమేష్,గోర్ల రాజు, శ్రీనివాస్ యాదవ్, ఈశ్వర్, రాము అశోక్ కుమార్ రెడ్డి శ్రీను జియా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


Comments