జాతీయ జెండాను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
-పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
Views: 24
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ఖమ్మం నగరంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జాతీయ జెండాను ఆవిష్కరించి సిటీ ఆర్ముడ్ రిజర్వ్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ముందుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ...
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యకామాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని, ప్రభుత్వ పధకాలు అందరూ సద్వినియోగపర్చుకొని ఆర్ధికాభివృద్ధి సాధించాలని డిప్యూటీ సీయం అన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments