ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలి 

-పోలీస్ కమిషనర్ సునీల్ దత్ 

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలి 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

గణేష్ నిమజ్జన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఖచ్చితమైన ప్రణాళికతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. గణేష్ నిమజ్జనం, బందోబస్తు ఏర్పాట్లపై గురువారం పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ 

నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ .. నిమజ్జనం సందర్భంగా ముందస్తు భద్రత ఏర్పాట్లతో ఏ చిన్న సంఘటనకు అస్కారం లేకుండా భక్తులు/సందర్శకులు క్షేమంగా తిరిగి వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని, నిమజ్జనం ప్రాంతాలలో బారిగెట్లు, క్రేన్లు, గజఈతగాళ్లు, మత్యకారులు, లైఫ్‌ జాకెట్లు, పడవలను అందుబాటులో ఉంచాలని, విధ్యుత్ శాఖ, మున్సిపల్ , పంచాయతీ రాజ్ , మత్యశాఖ అధికారుల సమన్వయంతో ప్రశాంతంగా నిమజ్జనం కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందిగా ట్రాఫిక్ నిర్వహణ వుండాలని అన్నారు. ఊరేగింపు, నిజమజ్జనాల సమయంలో మద్యం సేవించడం, సాధారణ జన జీవనానికి ఇబ్బంది కలిగించడం, ఆధ్యా త్మిక వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా ప్రవర్తించడం వంటి చర్యలు జరగకుండా అప్రమత్తంగా వుండాలని సూచించారు. గణేష్‌ ఉత్సవాలు, నిజమజ్జనాల నిర్వహణపై మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేశారు. భక్తులు, నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు.

వర్షాలు ఎక్కువగా ఉన్నందున నిమజ్ఞన కార్యక్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. .

జిల్లా వ్యాప్తంగా సమారు 27 వేల గణేష్ విగ్రహాలు రిజిస్టర్ అయిన విగ్రహాలు వున్నాయని తెలిపారు. ఈరోజు వరకు 243 విగ్రహాలు నిమజ్జనం చేశారని తెలిపారు.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నరేష్ కుమార్, అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు ఏసీపీ సంబారాజు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .