ఐదేళ్ల క్రితం చిన్నారి మిస్సింగ్‌.. పది గంటల్లోనే ఆచూకీ లభ్యం.. అసలేం జరిగిందంటే..

ఐదేళ్ల క్రితం చిన్నారి మిస్సింగ్‌.. పది గంటల్లోనే ఆచూకీ లభ్యం.. అసలేం జరిగిందంటే..

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తూర్పుగోనగూడెంలో చిన్నారి మిస్సింగ్‌ మిస్టరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోనగూడెం గ్రామానికి చెందిన కొర్రపు ఆదిలక్ష్మీకి ఐదేళ్ల క్రితం పండంటి ఆడబిడ్డ పుట్టింది. అయితే.. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి పొత్తిళ్లలోని చిన్నారి వారం తర్వాత మాయం కావడంతో షాక్‌ అయింది. బిడ్డ అదృశ్యంపై ఆ తల్లి ఐదేళ్లుగా తల్లడిల్లిపోతూ ఎంతమందికి మొరపెట్టుకున్నా ఆచూకీ మాత్రం కొనుక్కోలేకపోయారు. కానీ.. ఇటీవల చిన్నారుల మిస్సింగ్‌పై కూటమి సర్కార్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టడంతో ఆ తల్లిలో ఆశలు చిగురించాయి. ఎలాగైనా తన బిడ్డ ఆచూకీ తెలుసుకోవాలని తాపత్రాయ పడింది. ఈ క్రమంలోనే.. ఇటీవల గ్రీవెన్స్‌ డేలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది కొర్రపు ఆదిలక్ష్మీ.

ఐదేళ్ల క్రితం ఆస్పత్రిలో.. కన్న వారం రోజులకే తన బిడ్డను మాయం చేశారంటూ జిల్లా కలెక్టర్, అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఐదేళ్లుగా బిడ్డ కోసం పడుతోన్న బాధను.. తపనను అధికారుల ముందు వెల్లడించింది. తన బిడ్డను వెతికి అప్పగించాల్సిందిగా కలెక్టర్‌కు మొరపెట్టుకోవడంతో అధికార యంత్రాంగాన్ని అలెర్ట్‌ చేశారు. దాంతో.. బాలిక ఆచూకీ 24గంటల్లో కనుక్కోవాలని అధికారులను ఆదేశించడంతో అన్వేషణ మొదలుపెట్టారు.

తూర్పుగోనగూడెంలో పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేసిన అధికారులు.. 10 గంటల్లోనే చిన్నారి ఆచూకీని కనిపెట్టడంతో ఐదేళ్ల మిస్సింగ్‌ మిస్టరీ వీడింది. టెక్నాలజీ ఆధారంగా రాజమండ్రి పరిధిలోని లాలాచెరువు దగ్గర చిన్నారి ఆచూకీని గుర్తించారు పోలీసులు. లాలాచెరువు దగ్గర కొందరి నుంచి చిన్నారిని తీసుకుని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధిరులకు అప్పగించారు. చిన్నారి దొరికినట్లు తల్లికి తెలియజేయడంతో సంతోషం వ్యక్తం చేశారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .