గణేష్ మండపాలకు అనుమతులు తీసుకోవాలి

గణేష్ మండపాల నిర్వాహకులకు అవగాహన

గణేష్ మండపాలకు అనుమతులు తీసుకోవాలి

---పెద్దమందడి ఎస్సై శివకుమార్ 

వనపర్తి జిల్లా ప్రతిని తెలంగాణ ముచ్చట్లు:

గణేష్ మండపాల నిర్వాహకులకు పెద్దమందడి ఎస్ఐ శివకుమార్ అవగాహన కల్పించారు. బుధవారం పెద్దమందడి పోలీస్ స్టేషన్ ఆవరణంలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. గణేష్ మండపాల కోసం విధిగా అనుమతులు తీసుకోవాలని ఎస్ఐ శివకుమార్ అన్నారు. గణేష్ నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలని అలాగే పోలీస్ శాఖ వారు రూపొందించిన పోర్టల్ ద్వారా వివరాలను తప్పకుండా నమోదు చేయాలని అన్నారు. మండల ప్రజలు శాంతియుతంగా గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. శబ్ద కాలుష్యం ఉపయోగించకూడదని, రాత్రివేళ, మండపాల వద్ద కమిటీ సభ్యులు కాపలా ఉండాలని అన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు. గణేష్ నిమజ్జనానికి రూట్ మ్యాప్ తయారు చేసుకోవాలని సూచించారు. మండల ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని పెద్దమందడి ఎస్సై శివకుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .