గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసుల సమావేశం

గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసుల సమావేశం

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి జిల్లా పెద్దమందడి గ్రామంలో గణేష్ మండపాల నిర్వాహకులతో వనపర్తి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, కొత్తకోట సిఐ రాంబాబు, పెద్దమందడి ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు గణేష్ మండప నిర్వాహకులతో మాట్లాడుతూ... వినాయక చవితి పండుగ సందర్భంగా పెద్దమందడి మండల కేంద్రంలో గణేష్ మండప నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని నిర్వాహకులకు తెలిపారు. ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా, ఏలాంటి ఆవంచనియ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ లౌడ్స్ స్పీకర్స్ (డి జె) వాడకూడదని సూచించారు. నిమజ్జనానికి సంబంధించిన వాహనాల వివరాలను తెలియజేయాలని అన్నారు. శాంతియుత వాతావరణం లో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని పోలీసు అధికారులు నిర్వాహకులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దమందడి సింగిల్ విండో అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కొమ్ము వెంకటస్వామి, సూర్య రవి, రాఘవేందర్, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .